
వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్ జనగామ
రోజురోజుకీ పెరిగిపోతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు.శరీరానికి తగినంత నీరు అందించడం,వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం,మధ్యాహ్న వేళలో బయటకు వెళ్లకపోవడం వంటి సూచనలు చేశారు.వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు.ముఖ్యంగా చిన్నారులు,వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.