హనుమకొండ జూలై 17:వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు వరంగల్ నగరాభివృద్ధి నేపథ్యంలో వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ మరియు కాజీపేట వాటర్ ట్యాంక్ లను నగర మేయర్ గుండు సుధారాణి,నగర కమిషనర్ చాహత్ బాజ్పేయి మరియు ఇతర మున్సిపల్ అధికారులు,సిబ్బందితో కలిసి పరిశీలించారు.పరిశీలన సందర్భంగా ఫిల్టర్ బెడ్ లో నీటి శుద్ధి ప్రక్రియ,నిల్వ సామర్థ్యం,వసతులను ఎమ్మెల్యే సమీక్షించారు.జనాభా పెరుగుదల దృష్ట్యా రూ.2.50 కోట్లతో ఫిల్టర్ బెడ్ మరమత్తులు మరియు సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా 5 MLD కెపాసిటీ గల కొత్త వాటర్ ట్యాంక్ లను గోపాలపూర్,కాజీపేట,వడ్డేపల్లి లలో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.నీటి సరఫరాలో అధికారులు,క్షేత్రస్థాయి సిబ్బందిలో సమన్వయం లోపం వలన ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన,రవాణా పద్ధతులు సజావుగా ఉండేలా పర్యవేక్షణ పెంచాలని,ఫిల్టర్ బెడ్ లో నిఘా కాంక్రీటు చర్యలు తీసుకోవాలని సూచించారు.మరమత్తుల్లో నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అనంతరం వన మహోత్సవం లో భాగంగా మున్సిపల్ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు ఎమ్మెల్యే నాగరాజు,ఎమ్మెల్యే నాయిని,మేయర్ సుధారాణి,కమిషనర్ చాహత్ బాజ్పేయి కలిసి నాటారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు,ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.