వయోవృద్ధుల చట్టాలు-ఆరోగ్యం పై అవగాహన
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం (అక్టోబర్ 1) ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాల భాగంగా,జనగామ జిల్లా మహిళ,శిశు,దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వృద్ధుల చట్టాలు,ఆరోగ్యం మరియు చురుకైన వృద్ధాప్యం పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం సోమవారం రుద్రమదేవి వృద్ధాశ్రమంలో నిర్వహించబడింది.జిల్లా సంక్షేమ అధికారి కె.కోదండరాములు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై,వృద్ధులు తెలుసుకోవలసిన హక్కులు,చట్టపరమైన రక్షణలు,ఆరోగ్య సంరక్షణ,మానసికంగా-శారీరకంగా చురుకుగా ఉండే విధానాలపై వివరించారు.జిల్లా స్థాయి కమిటీ సభ్యురాలు క్యాథరిన్ కూడా అవగాహన కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు ఉపయోగకరమైన సూచనలు అందించారు.కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సిద్దిమల్లయ్య,మల్లారెడ్డి,రామస్వామి,రాజయ్య,బిక్షపతి,రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా సీడీపీఓ సత్యవతి,సూపర్వైజర్ స్వాతి,ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ రాజు,వృద్ధాశ్రమ నిర్వాహకులు,సిబ్బంది మరియు జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.జిల్లాలో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు చేరవేయడం,వృద్ధుల్లో హక్కులపై అవగాహన పెంపొందించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.