వరంగల్ నగర యంసిపిఐ(యు) నూతన కమిటీ ఎన్నిక
Uncategorizedమాలోతు సాగర్ నగర కార్యదర్శిగా, సుంచు జగదీశ్వర్ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు

ఈ69న్యూస్ వరంగల్, జూలై 27:
యంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ప్లీనరీ సమావేశం శనివారం కరిమాబాద్లో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో 25 మందితో కూడిన నూతన నగర కమిటీని ఏర్పాటు చేశారు. మాలోతు సాగర్ను నగర కార్యదర్శిగా, సుంచు జగదీశ్వర్ను సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
కార్యవర్గ సభ్యులుగా నర్ర ప్రతాప్, ముక్కెర రామస్వామి, ఎగ్గేని మల్లికార్జున్, ఐతం నాగేశ్, మాలోతు ప్రత్యుషలను ఎంపిక చేశారు. మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు, తాటికాయల రత్నం, గణేపాక ఓదెలు, సింగారపు దాసు, ఎండీ అక్బరుద్దీన్, నల్లెల రాజేందర్ తదితరులు నగర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మాలోతు సాగర్ మాట్లాడుతూ, ‘‘చారిత్రక నగరమైన వరంగల్ పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. మురికివాడలు, గుడిసెవాసుల సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సరైన డ్రైనేజ్ లేక అనేక కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. యువత నిరుద్యోగంతో మత్తుకు బానిసవుతోంది. కార్మికుల వేతనాలు తగ్గుతున్నాయి. మహిళలు మైక్రో ఫైనాన్స్ మరియు వడ్డీ వ్యాపారాల బారిన పడుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కేవలం ప్రచారానికి ఉపయోగపడుతున్నాయని, పేదలకు చేరడం లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి యంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.