
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఖిల్లా వరంగల్ మండలం మామునూరు లక్ష్మీపురం 43వ డివిజన్లో గల ప్రభుత్వ పశు వైద్య కళాశాల పరిసర ప్రాంతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున స్వచ్ భారత్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ వి.కరుణాకర్ మరియు జవాన్లు శ్రీధర్,ప్రశాంత్,రవి,ఎన్ఎస్ఎస్ అధికారులు వంశీ కృష్ణ,రాజశ్రీ,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.