వరంగల్ పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కు లేఖ
వర్షం పడటంతో దుకాణం దారులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన
వరంగల్ పశ్చిమ నియోజక వర్గం గౌరవ ఎమ్మెల్యే శ్రీ.నాయిని రాజేందర్ ఆన్న కు నమస్కరించి తెలియ చేయునది ఏమనగా!
7వ డివిజన్ పరిదిలో రాత్రి సుమారు 9 గంటల సమయంలో విపరీతంగా వర్షం పడటం వల్ల హన్మకొండ చౌరస్తా విజయ టాకీస్ పోయే దారిలో దుకానం దారుల పరిస్తితి చాల ప్రమాద కరంగా మారింది.ఈ దుస్థితి బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన లో 14 సంవత్సరాల నుండి షాప్ ఓనర్స్ దారులు భరిస్తున్నారు.లక్షల కొద్దీ స్టాక్ మెయింటెయిన్ చేసుకుంటూ వర్షాకాలం రాగానే వర్షం భయంతో షాప్ నడపడం చాల ఇబ్బందిగా ఉంది.దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి మా అందరి సమస్యని పరిష్కరించగలరని మీకు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.
ప్రార్థనతో ఇట్లు స్ట్రీట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టీమ్ ఇంఛార్జి సయ్యద్ సలీం,వెస్ట్ ఆస్ ఈస్ట్ కాన్స్టిట్యూన్సి వరంగల్ అర్బన్ జిల్లా.