
telugu galam news e69news local news daily news today news
-ఎన్నారై చింత ప్రవీణ్ కుమార్
పుష్పాలంకరణ కార్యక్రమానికి చింత బ్లాండినా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కేజిల బియ్యం పంపిణీ గళం న్యూస్ వరంగల్ జనవరి 20 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ తూర్పు నియోజకవర్గం 41వ డివిజన్ లో శనివారం ఎర్ర ప్రవీణ్ శ్రావణిల కుమార్తె సౌమ్య పుష్పాలంకరణ కార్యక్రమం సందర్భంగా చింత బ్లాండినా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం వారికి అందజేశారు.అనంతరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చింత ప్రవీణ్ కుమార్ (ఎన్నారై)మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా వారి తల్లి చింత బ్లాండిన జ్ఞాపకార్ధంగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.రానున్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్నట్లు తెలిపారు.అందుకు గాను ఈ మధ్యకాలంలో మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావులను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని అన్నారు.వారి తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింత ప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులలో సొంత ఖర్చులకు కూడా వెనుకాడకుండా అభివృద్ధి పనులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ టికెట్ తనకు కేటాయిస్తే,ప్రజలకు సేవ చేసుకుంటూ.. అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గాదె నవీన్,కోట యాదగిరి,రేణుకుంట్ల నెల్సన్,మంద సతీష్,కన్నాల రవికుమార్,వేల్పుగొండ రవికుమార్,వేల్పుగొండ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.