ఈ69న్యూస్ వరంగల్ జూలై 28 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి జన్మదినం సందర్భంగా జర్నలిస్టులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ను కలిసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి జన్మదినాభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి బొట్ల స్వామిదాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డా.పాలడుగుల సురేందర్,ఉపాధ్యక్షుడు వెల్ది రాజేందర్, సభ్యుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.