
ఈ69 న్యూస్ వరంగల్,జూలై 23
వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ మోతాదులో ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇంతెజార్గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి 18 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.మద్యం,మత్తు పదార్థాల అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు ఈ విజయం సాధించారు.బుధవారం ఉదయం ఇంతెజార్గంజ్ పోలీసులు రైల్వే స్టేషన్ సమీపంలో రూటీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రవి టిఫిన్ సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా నాలుగు పెద్ద బ్యాగులతో ఉన్నారు.విచారించినప్పుడు వారు ఒడిశాకు చెందినవారిగా హిందీ,ఒడియా భాషల్లో స్పందించారు.వెంటనే పోలీసు సిబ్బంది బ్యాగులను తనిఖీ చేయగా,అందులో 18 కిలోల ఎండు గంజాయి బయటపడింది.అరెస్టు చేసిన వారిలో మగ వ్యక్తి పేరు జులియం బెహరా (60),ఆడ వ్యక్తి అతని భార్య జులియం కుమారి బెహరా (55)గా గుర్తించారు.వీరు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని కట్టంగుమా గ్రామానికి చెందిన కూలీలు.తక్కువ ఆదాయంతో సంతృప్తి చెందలేక గంజాయి వ్యాపారంలోకి దిగినట్లు విచారణలో వెల్లడించారు.వారు తమ గ్రామం వద్ద గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి,సోలాపూర్ వెళ్లి కిలోకు ₹50,000 చొప్పున అమ్మాలని భావించారు.టికెట్ లేకుండా రైలు ప్రయాణిస్తున్న సమయంలో టిటి తనిఖీకి భయపడి వరంగల్ స్టేషన్లో దిగారు.కోణార్క్ ఎక్స్ప్రెస్ రావాల్సిన సమయంలో టిఫిన్ తినేందుకు బయటికొచ్చిన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.ఈ సందర్భంగా మొత్తం రూ.9 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.నిందితులను అరెస్టు చేసి వరంగల్ కోర్టుకు హాజరు పరిచారు.ఈ తనిఖీ మరియు పట్టుబడిన ఆపరేషన్ను సీఐ సుకుర్,ఎస్సైలు నీలోజు వెంకటేశ్వర్లు,తేజ,ఏఎస్ఐ బిక్షపతి మరియు పోలీస్ సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.