వరద బాధితులకు అండగా మరిపెడ డివిజన్ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్
Mahabubabad140 కుటుంబలకు నిత్యవసర సరుకుల పంపిణీ.
మరిపెడ వ్యవసాయ శాఖ ఏడిఏ విజయచంద్ర.
మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ఉల్లేపల్లి గ్రామంలో వరద బాధితులకు సహాయార్థం మరిపెడ డివిజన్ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా మరిపెడ ఏడిఏ విజయచంద్ర,మరియు ఏవో వీరా సింగ్,పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరిపెడ వ్యవసాయ శాఖ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిత్యావనర సరుకులు పంపిణీ చేశారు. మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామ పంచాయతీ లో 140 మంది వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి బాధిత కుటుంబాలకు సహాయం వేసేలా చొరవ చూచి అదుకోవాలని పిలుపునిచ్చారు. మరిపెడ డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ సహకారంతో నిత్యవసరాల సరుకులు పంపిణీ చేసిన వారి కుటుంబ లకు తక్కువేనని అన్నారు. ఇంట్లో ఉన్న సామాన్లను కొట్టుకుపోయాయని సర్టిఫికెల్లు సైతం చేతికి అందకుండా పోయాయి అని వాపోతున్నారు,ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకోవాలని గ్రామ ప్రజలు కోరుకున్నారు. కోళ్లు మేకలు గొర్లు అన్ని కొట్టుకుపోయాయని ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే చొరవతో మాకు నివాస స్థలం తో పాటు, ఇల్లు కట్టించి ఇక్కడ నుండి సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాలం శ్రీనివాస్ రెడ్డి,కార్యదర్శి చల్లా హరీష్,కోశాధికారి జడల సురేందర్,ఉపాధ్యక్షులు ఉప్పల కృష్ణమూర్తి,కమిటీ మెంబర్స్ గూండాల ప్రసాద్,గుండాల అంబరీష,తొర్రూర్ అధ్యక్షులు మహేష్,దంతాలపల్లి అధ్యక్షులు గణేష్,మరియు గోపాల్ రెడ్డి,గర్రెపల్లి వెంకన్న,రమేష్ రెడ్డి,నాగరాజు రెడ్డి,గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.