
మండల పరిధి వైట్ నాగారం గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు మృతి చెందాడు. సింగవరం గ్రామ పంచాయతీకి చెందిన పాయం. పుల్లయ్య 57 సంవత్సరాలు మధ్యాహ్నం పశువుల మేపుటకు అటవీ ప్రాంతానికి వెళ్ళాడు పశువుల మేపుతున్న సమయంలో వర్షం వస్తుందని చెట్టు ఆసరాగా ఉంటుందని గ్రహించి చెట్టు కిందకు వెళ్ళగానే పిడుగు పడి పుల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గ్రహించిన మరో ఇద్దరు వ్యక్తులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి గ్రామస్తులను తీసుకొని వచ్చారు.