
వాగ్దానాలు మరిచిన ముఖ్యమంత్రిని సాగనంపుదాం
కోదాడ పట్టణంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన రెండవ ఏఎన్ఎం ల ఆధ్వర్యంలో కోదాడ రంగా థియేటర్ చౌరస్తాలో మానవహారం రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భముగా మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక ప్రగల్బాలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి రెండుసార్లు గెలిచిన తర్వాత తన కళ్ళు నెత్తికెక్కాయ్ అని ఆయన విమర్శించారు తెలంగాణ రాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే పదమే ఉండదని చెప్పిన ముఖ్యమంత్రి నేటికీ ఆ వాగ్దానం మర్చిపోయినట్టు ఉన్నాడు రాష్ట్రంలో రెండవ కార్మికులు తన విధులను బహిష్కరించి ఎనిమిది రోజులుగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చలనం కలగడం లేదని కరోనా సమయంలో తన ప్రాణాలకు లెక్క చేయకుండా తమ కుటుంబాలను వదిలి అహోరాత్రులు శ్రమించి కరోనా మహమ్మారి నుండి బయటపడడానికి వారి సహకారం మరవలేనిదని ఆనాడు ప్రశంసల కురిపించిన ముఖ్యమంత్రి ఈనాడు వారిని రెగ్యులర్ చేయమని అడిగితే ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతామని బెదిరిస్తున్నాడు ఇలాంటి మాట తప్పే ముఖ్యమంత్రిని సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చేపూరి కొండలు ఏఎన్ఎం నాయకురాలు రాధా అనిత సరిత రూప గోపమ్మ నిర్మలా పద్మ నరసమ్మ నీరజ తదితరులు పాల్గొన్నారు