
వారం రోజుల్లోనే చేదించిన ధర్మసాగర్ పోలీసులు
ఈ69న్యూస్ ధర్మసాగర్/రిపోర్టర్ స్టీఫెన్ (ప్రణయ్)
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో చోటు చేసుకున్న స్కూటీ చోరీ కేసును ధర్మసాగర్ పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు.స్థానికుడు మునగాల రాజయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు,నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నాదెండ్ల వెంకట సుబ్బయ్య అనే యువకుడు ఎక్కువ డబ్బుల ఆశతో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో వెల్లడైంది.అతడు స్కూటీతో పాటు బంగారు ఆభరణాల దొంగతనాలకు కూడా సంబంధం ఉన్నట్టు ఒప్పుకున్నాడు.నిందితుడి వద్ద నుండి స్కూటీ,మొబైల్ ఫోన్,బంగారం తాకట్టు పెట్టిన రశీదులు స్వాధీనం చేసుకుని,రిమాండ్‌కు తరలించినట్టు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.