
telugu galam news e69news local news daily news today news
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని వివరించిన:మేనేజర్ జగన్
భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బ్యాంక్ స్కింలను క్షుణ్ణంగా వివరించిన:జగన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం లో చుంచుపల్లి తండా,పంచాయితీ అఫిస్ లో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నోడల్ అధికారిగా విద్యానగర్ కాలనీ యస్.బి.ఐ బ్యాంక్ మేనేజర్ జగన్ పాల్గొని భారతదేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని గురించి గ్రామ ప్రజలకు వివరిస్తున్న జగన్ కార్యక్రమములో జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు భారత దేశంలో అనేకమంది ప్రజలు నీటి సమస్యలతో భాద పడుతుంటే వారికి నీటి ఇబ్బందులు లేకుండా దేశంలో ఇప్పటి వరకు 13.5కోట్లకు పైగా కుళాయిలు ఏర్పాటు చేశారు,రైతులకు ప్రతి సంవత్సరం అరు వేల రూపాయలు 11కోట్లకు పైగా రైతులకు ఇప్పటి వరకు 2.6 లక్షల కోట్ల రూపాయలు సహాయం అందించారు,అందరికీ పక్క ఇల్లు ఇళ్లు లేని పేద ప్రజలకు ఇప్పటి వరకు 4కోట్లకు పైగా పక్క ఇళ్ల నిర్మాణం అందించారు,అనేక మంది మహిళలు గ్యాస్ స్టవ్ లేక ఇబ్బందులు పడుతుంటే పొగ లేని వంటిల్లు కోసం ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన క్రింద ఇప్పటి వరకు 10కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందించరని అదేవిధంగా భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన,బ్యాంక్ స్కింలు,హెల్త్ ఇన్సూరెన్స్,రైతుల వ్యవసాయ రుణాలు కోసం ప్రజలకు అర్దం అయ్యేలా జగన్ వివరించారు ఈ కార్యక్రమములో:సర్పంచ్ ధనలక్ష్మి,యం.పి.టి.సి రాంబాబు,డాక్టర్ మరియు వారి సిబ్బంది ,పంచాయితీ సెక్రటరీ సత్యనారాయణ,రవి,మరియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు