
స్వేరో నెట్వర్క్ మరియు అనుభంద సంఘాల వారి సహకారంతో
స్వేరో నెట్వర్క్ మరియు అనుభంద సంఘాల వారి సహకారంతో…
తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 21
పరకాల పట్టణ మరియు చుట్టుపక్కల సమస్త గ్రామ ప్రజానికానికి సువర్ణ అవకాశంగా ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా పరీక్షించుకునే అవకాశం కల్పించిన స్వారో బృందం అక్షరం ఆరోగ్యం ఆర్థికం అనే మూడు ప్రధానమైన లక్ష్యాలతో ఏర్పాటైన స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ.అదేవిధంగా నేడు సమాజంలో సీజనల్ వ్యాధులు,పరిశుభ్రత లేక, కలుషిత ఆహారం,గాలి, నీరు అన్ని కలుషితమై ప్రజలు అనేక రోగాల బారిన పడుతూ ఆర్థికంగా చితికి పోతున్న తరుణంలో స్వేరోస్ గా కనీసం కొద్ది మంది ప్రజలకైన మంచి ఆరోగ్యాన్ని అందించే దిశలో పరకాల పట్టణంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ చంద్రమోహన్ (కార్డియాలజీ) మాట్లాడుతూ మనం చదువుకొని ఉన్నతమైన స్థాయిలో మనమే ఉండకుండా మనకున్న ప్రొఫెషన్ కి సమాజానికి కొంతైనా సర్వీస్ చేయడం ద్వారా విద్యార్థులకు మిగతా వారందరికీ ఆదర్శంగా ఉంటుందని అన్నారు. నిరుపేదలు, ధనికులు అని తేడా లేకుండా ప్రజలకు వచ్చే గుండె, క్యాన్సర్, గైనిక్ మరియు వివిధ ఆరోగ్యసమస్యల ను దృష్టి సారించి స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ గారి సౌజన్యంతో డాక్టర్ చంద్రమోహన్ స్వేరో మేకల ( గుండె వ్యాధి నిపుణులు ) మరియు ఇతర రకాల డాక్టర్ల చే ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.