
telugu galam news e69news local news daily news today news
అహ్మదియ్య ముస్లిం జామాతు పరిపూర్ణ విశ్వాసము,నమ్మకము మరియు సంపూర్ణ విజ్ఞానంతో హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లంను ఖాతమున్నబియ్యీన్ అని విశ్వసిస్తుంది-జాతీయ ప్రెస్ & మీడియా ఇంచార్టీ మౌల్వీ కె తారిక్ అహ్మద్ అహ్మదీయ ముస్లిం కమ్మూనిటీ గురించి అన్వేషణ కొరకు ఈ ఫోన్ నెంబర్ లను సంప్రదించండి టెలిఫోన్ నెం|| 0187-500311, నూరల్ ఇస్లాం టోల్ ఫ్రీ నెంబరు1800 103 2131 గళం న్యూస్ ఖాదియాన్ అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం జమాతు గురించి గత కొన్ని రోజుల నుండి పలు పత్రికల్లో వాస్తవ విరుద్ధమైన వార్తలు ప్రచురితమవుతున్నాయి. మరియు అహ్మదియ్య ముస్లింలు హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లంను ఖాతమున్నబియ్యీన్ అని విశ్వసించరని(అల్లాహ్ క్షమించుగాక!)కావున వారిని ఇస్లాం నుండి బహిష్కరించడం జరిగిందనే తప్పుడు అరోపణలు చేస్తున్నారు.పత్రికల్లో చెయ్యబడ్డ ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం,నిరాధారమైనవని అహ్మదీయ ముస్లిం కమ్మూనిటీ జాతీయ ప్రెస్ & మీడియా ఇంచార్జి మౌల్వీ కె.తారీక్ అహ్మద్ పేర్కోన్నారు.బుధవారం వారు మీడియా ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అహ్మదియ్య ముస్లిం జామాత్ పూర్ణ విశ్వాసము,నమ్మకము మరియు సంపూర్ణ విజ్ఞానంతో హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లంను ఖాతమున్నబియ్యీన్ అని విశ్వసిస్తుందని,మరియు విశ్వనాయకులని,సృష్టిలో శ్రేష్ఠులు హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లంకు అల్లాహ్ తాలా ఖాతమున్నబియ్యీన్ అనే కిరీటాన్ని ధరింపజేశాడని వారి నుండి ఈ కిరీటాన్ని లాక్కునే శక్తి ఎవరికీ లేదని మనసా, వాచా ప్రకటిస్తున్నామని తెలిపారు.పద్నాలుగో శతాబ్దంలో ఇమామ్ మహ్దీ అవతరిస్తాడనీ,మరియు వారి సత్యానికి అల్లాహ్ తాలా సూర్య,చంద్ర గ్రహణాల సంకేతాలను ప్రదర్శిస్తాడనీ ఖాతమున్నబియ్యీన్ హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లం భవిష్యవాణి చేశారని అన్నారు.ఆ ఇమామ్ మహీ అవతరించినప్పుడు ఖచ్చితంగా వారి బైఅతు (ప్రతిజ్ఞ) చెయ్యాలని ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స.అ.స) ఆజ్ఞాపించారని తెలిపారు.ఈ భవిష్యవాణి ప్రకారం హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్ సాహెబ్ ఖాదియానీ అలైహిస్సలామ్, ఇమామ్ మహ్దీ మరియు మసీహ్ మౌవూద్ నని ప్రకటించారని,అల్లాహ్ తాలా వీరి సత్యానికై,సత్యసువార్తికులు హజ్రత్ ముహమ్మద్ (స.అ.స) భవిష్యవాణి ప్రకారం1894 సం॥లో మొదటగా మరియు 1895వ సంవత్సరంలో రెండవ సారి సూర్య,చంద్ర గ్రహణాల సంకేతాన్ని ప్రదర్శించాడని,అందువల్ల హజ్రత్ ముహమ్మద్ (స.అ.స) ఆజ్ఞను అనుసరిస్తూ అహ్మదియ్య ముస్లిం జమాతు ఈ కాలపు ఇమామ్ హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్ సాహెబ్ ఖాదియానీ అలైహిస్సలామ్ బైఅతు చేసి వారి జమాతులో చేరామని తెలిపారు. ముస్లింలారా కొద్దిగా ఆలోచించండి ఖాతమున్నబియ్యీన్ (స.అ.స) ఆజ్ఞను అనుసరించినందుకే అహ్మదియ్య ముస్లిం జమాతు సభ్యులు కాఫిర్లా (అవిశ్వాసులా?. అల్లాహ్, ప్రవక్త ఆదేశాల ప్రకారం “అర్కానే ఈమాన్” విశ్వాస సూత్రాలను విశ్వసించడం ఒక అహ్మదీ ముసల్మాన్ను “కాఫిర్”గా మారుస్తుందా?. “ఖానా కఅబా” కఅబా గృహము వైపు ముఖము త్రిప్పుకొని నమాజు చెయ్యడం ఒక అహ్మదీ ముసల్మాన్ను “కాఫిర్”గా మారుస్తుందా?. హజ్రత్ ముహమ్మద్ (స.అ.స) భవిష్యవాణుల ప్రకారం అల్లాహ్ తాలా తరఫు నుండి వారి సత్యానికై సూర్య,చంద్ర గ్రహణాలు,ఇంకా అనేక భూమ్యాకాశాల సంకేతాలు బహిర్గతమైనందు వల్ల వారిని విశ్వసించి నందున అహ్మదియ్య ముస్లిం జమాతును ఇస్లాం నుండి బహిష్కరిస్తుందా?. ఖురాన్ కరీమ్ ప్రచురణ, దాన్ని ప్రపంచమంతా వ్యాపింపజెయ్యడం ఒక అహ్మదీ ముసల్మాన్ను “కాఫిర్”గా మారుస్తుందా?. పవిత్ర ఖుర్ఆన్ మజీదు 73 దేశాల భాషల్లో అనువాదం చేసి, ప్రచురించడం అవిశ్వాసమా? అని ప్రశ్నించారు.హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లంను శాంతి సందేశకర్తగా ప్రపంచానికి పరిచయం చెయ్యడం అహ్మదియ్య ముస్లిం జమాతును “కాఫిర్”గా మారుస్తుందా?. హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లం ఉత్తమ జీవిత చరిత్రను ప్రచురించడం మరియు వారి (స.అ.స) సుందరమైన బోధనలను ప్రపంచంలో విస్తరించడం అహ్మదియ్యులను “కాఫిర్”గా మారుస్తుందా?. హజ్రత్ ముహమ్మద్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లంను నిజమైన అర్థంలో ఖాతమున్నబియ్యీన్ అని విశ్వసించడం ఒక అహ్మదీ ముసల్మాన్ను “కాఫిర్”గా మారుస్తుందా?. ఐరోపా, ఆసియా మరియు ఆఫ్రికా, అమెరికాల్లో మస్జిద్ లు నిర్మించడం ఒక అహ్మదీ ముసల్మాన్ను “కాఫిర్”గా మారుస్తుందా?.ప్రపంచమంతా ఇస్లాం ప్రచారం చేస్తూ,ప్రజలను ఇస్లాంలో చేర్పించడం అహ్మదీ ముసల్మానులను “కాఫిర్”గా మారుస్తుందా?. కావున సాధారణ ముస్లిములతో మా వినయపూర్వక విజ్ఞప్తి ఏమనగా! వారు (ఉమ్మత్) ఇస్లాం సమాజం యొక్క నిజమైన ఇమామ్ మహీని తిరస్కరించి అల్లాహ్ తాలా, ఆయన ప్రవక్త అసంతృప్తికి కారకులైతే కావడం లేదు కదా?. అని ఆలోచించుకోవాలని హితబోధ చేశారు. అహ్మదియ్య జమాతు స్థాపకులు తన బోధనల సారాంశాన్ని ఈ విధంగా స్పష్టంగా తెల్పుతున్నారు; “లాయిలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహి” అనేదే మా ధర్మ సారము మరియు సారాంశము. మరియు హజ్రత్ సయ్యద్నా ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లం ఖాతమున్నబియ్యీన్, ఖైరుల్ ముర్సలీన్ (ప్రవక్తల ముద్ర, ప్రవక్తలందరిలో సర్వోత్తములు) వీరి చేతితోనే ధర్మము పరిపూర్ణమై, మానవుడు ఏ మార్గంలో నడిచి అల్లాహ్ దగ్గరకు చేరుకోగలడో, ఆ వరము ఉన్నత శిఖరానికి చేరింది. ఖుర్ఆన్ షరీఫ్ ఆకాశ చివరి గ్రంథము, ఈ ధర్మ శాసనంలో ఒక్క పొల్లైనా ఒత్తైనా లేదా హద్దులు, ఆజ్ఞలు మరియు అంశాలనైనా పెంచలేము మరియు తగ్గించలేము అన్నదే మా విశ్వాసము. మేము ఈ విశ్వాసముతోనే అల్లాహ్ దయవల్ల ఈ ప్రపంచము నుండి వెళ్ళిపోదుము.” (ఇజాలయె ఔహామ్; రూహానీ ఖజాయిన్, సంపుటి; 3, పుట; 170) ఖుర్ఆన్ మజీద్ వైభవము, హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పవిత్ర జీవిత చరిత్ర గురించి అహ్మదియ్య ముస్లిం జమాతు ప్రచురించిన విజ్ఞాన, విశ్వాసభరిత లెట్రేచర్ అద్భుత రీతిలో మీ జ్ఞానాన్ని పెంచుతుంది. మరియు అసలు విషయం మీకు తెలుస్తుంది. మరింత సమాచారానికై సంప్రదించండని అన్నారు..