
విదేశీ వస్త్రాలు వద్దు, పద్మశాలి,చేనేత వస్త్రాలు ముద్దు
మహబూబాబాద్ జిల్లా జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక రోడ్లు భవనాలు శాఖ అతిధి గృహంలో సోమవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతీయ చేనేత ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లిఖార్జున,రాష్ట్ర అధ్యక్షులు మాడ రాజా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట దామోదర్,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు చిలివరు రామకృష్ణ,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఎలుభాక సుజాత,రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కల్లేపెల్లి అక్షిత ల ఆదేశాల మేరకు మరిపెడ మండల అధ్యక్షులు కారంపూడి ఉపేందర్ అధ్వర్యంలో నిర్వహించిన పత్రిక సమావేశానికి ముఖ్య అతిధులుగా జాతీయ చేనేత ఐక్య వేదిక మానుకోట జిల్లా అధ్యక్షులు కారంపురి వెంకటేశ్వర్లు,ప్రథాన కార్యదర్శి దేవరశేట్టి శ్రీశైలం లు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన పద్మశాలి,చేనేతలకు,మరియు మన కుల అనుబంధ వృతుల,పద్మశాలి,చేనేత కుల బంధువులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి జాతీయ చేనేత ఐక్య వేదిక మానుకోట జిల్లా అధ్యక్షులు కారంపురి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మనం ప్రతి ఈ సంవస్తారం రోజు అనగా ఆగస్ట్ 7వ తారీఖున జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రాముఖ్యత ఉన్నదన్నారు.118 సం:ల క్రితం అంటే ,1905 ఆగస్ట్ 7న అప్పటి కలకత్తా రాష్ట్రంలో
స్వదేశీ ఉద్యమము మొదలైన
ఆ రోజున మన దేశంలోని
చేనేతలు,స్వదేశీ అభిమానులు,కలకత్తా నగరంలో ఉన్న ప్రజలు
కలకత్తా నగరము నడిబొడ్డున
స్వదేశీ నినాదంతో,స్వదేశీ వస్త్రాలను ధరించాలి,విదేశీ వస్త్రాలను భాహిష్కరించాలనే నినాదంతో బహిరంగంగా విదేశీ వస్త్రాలను తగులపెట్టారని అన్నారు.ఆ సందర్భంలో మన దేశ భక్తులైన ప్రజలను విదేశీ పరిపాలకులు విచక్షణ రహితంగా,రాక్షసత్వంగా
బహిరంగంగా కాల్పులు జరిపారని,ఆ విదేశీ దుష్ట పరిపాలకుల కాల్పులలో
మన దేశ భక్తులైన ప్రజలు
అనేక లక్షలమంది వీరమరణం పొందారని,అమర వీరుల,దేశ భక్తి కలిగిన మన ప్రజలు వీర మరణం పొందిన వారిని మనసులో తలుచుకుంటూ వారికి గుర్తుగా ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని మన జరుపుకుంటున్నామని అన్నారు.నేతన్నలు చెమటోడ్చి నేసిన వస్త్రంలో దాగి ఉన్న నేతన్న బక్కచిక్కిన దేహం దారపు పోగులా,కడుపులో గంపెడు ఆకలి,కడలి లాంటి కష్టాలతో సహజీవనం చేస్తూ,ఆకాశమంత అంతులేని పేదరికాన్ని గుండెల్లో అనుభవిస్తూ,తరతరాలుగా తాత ముత్తాతల నుండి వచ్చిన వారసత్వ సంపదలా తీసుకున్న వృత్తిని దైవంగా భావిస్తూ,ఆకలిని మునిపంటితో బిగబట్టి,చేనేత మగ్గంపై నీ అత్యుత్తమమైన కళా నైపుణ్యానికి,కటోరమైన శ్రమను జోడించి అద్భుతమైన రంగు,రంగుల డిజైన్లతో వస్త్రాలను లోకానికి అందిస్తున్న నీకు వస్త్రం కరువైనదా నేతన్న,చిరిగిన బనీను,పంచెతో ఉన్న వెందుకన్న,ప్రభుత్వాలు ఎన్ని మారినా పద్మశాలి,చేనేతల బ్రతుకుల్లో వెలుగులు నింపే నాయకులు కను చూపు మేరలో లేరని నేత కార్మికులు వారి భాధలు తెలియ చేస్తున్నారని,వారిని ఆదుకోవలసిన భాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదన్నారు.దేశంలో రైతన్న తర్వాత అత్యధిక శాతం ఆత్మహత్యలు,ఆకలి చావులు చచ్చింది ఒక్క పద్మశాలి,చేనేత కులాల్లోనే జరిగినాయని గుర్తు చేశారు.దేశానికి అన్నం పెడుతున్నది రైతు అనేది ఎంత నిజమో,మనిషి మానాన్ని,అభిమానాన్ని కాపాడుతున్నది పద్మశాలి చేనేత కులాలదేనని అన్నారు.నేతన్న నేసిన వస్త్రం వంటి మీద లేనిది ఇంటిలోనుండి బైటకు వెళ్లలేరని,ప్రధాన మంత్రి నుండి,పల్లెటూర్లో జీతం చేసుకునే వారికి కూడా వంటిపై వస్త్రం కావాలని అలాంటి ప్రాముఖ్యత కలిగిన నేత కులాలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం తగదని,పద్మశాలి చేనేతలకు చేనేత బంధు అందించి నేత కులాలను ఆదుకోవాలని,అలాగే 50సంవత్సారాలు దాటిన నేతన్నలకు నెలకు 10 వెయిల రూపాయల పింఛను ఇవ్వాలని,అలాగే కుల వృత్తిని నమ్ముకొని నేతపై ఆధారపడి ఉన్న నేత కార్మికులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.అనంతరం ప్రధాన కార్యదర్శి దెవరశెట్టి శ్రీశైలం మాట్లాడుతూ, .దళిత భందులాగా చేనేత బంధు ప్రకటించి ప్రతి చేనేతలకు 20 లక్షల రూపాయలు ఇచ్చి చేనేతలను,చేనేత కళాకారులను కాపాడాలన్నారు.అలాగేరాష్టంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలి అన్నా పద్మశాలి ల పాత్ర ప్రధానమైనదని,ఇంతవరకు ఏ ప్రభుత్వాలు పద్మశాలి,చేనేతలను రాజకీయంగా గుర్తించటం లేరని,తటస్థంగా ఉంటున్న పద్మశాలి,చేనేతలు ఏకమైతే ప్రభుత్వాలను శాసించే స్థాయి పద్మశాలి,చేనేత కులాలకు ఉన్నదని,పద్మశాలి లకు రాజకీయంలో ఏపిలుగా,ఏమ్మెళ్యెలుగా,ఏమ్మెల్సిలుగా,వారీ వారి స్తోమతలకు తగ్గట్టుగా పదవుల్లో ప్రాముఖ్యత కలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో దేవసెట్టి లక్ష్మీనారాయణ,మోహన్,వెంకటేశ్వర్లు,రాజేష్ తదతరులు పాల్గొన్నారు.