విద్యకు వెలుగు… గిరిజన విద్యకు గర్వకారణం
చనగలగడ్డ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామా నాయక్ ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా “ఉత్తమ ప్రధానోపాధ్యాయులు”గా అవార్డు అందుకోవడం పాఠశాలకే కాదు, మొత్తం గిరిజన విద్యా రంగానికే గర్వకారణంగా నిలిచింది.
ఈ విశిష్ట గౌరవాన్ని పురస్కరించుకొని, పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ప్రధానోపాధ్యాయులు నామా నాయక్‌కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి, విద్యార్థులు తమ ఆనందాన్ని చప్పట్లతో వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ,
గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, నైతిక విలువల పెంపొందింపులో ప్రధానోపాధ్యాయులు నామా నాయక్ చూపుతున్న నిబద్ధత, నిరంతర కృషికే ఈ అవార్డు నిదర్శనమన్నారు. పరిమిత వసతుల మధ్యన కూడా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ, పాఠశాల స్థాయిని జిల్లాలోనే ఆదర్శంగా నిలబెట్టిన ఘనత ఆయనదేనని కొనియాడారు.
విద్యార్థులు మాట్లాడుతూ,
తమ జీవితాలకు దిశానిర్దేశం చేస్తున్న గురువుగా, తల్లిదండ్రుల్లా మార్గనిర్దేశం చేస్తున్న ప్రధానోపాధ్యాయులు నామా నాయక్ గారి గౌరవం తమకెంతో ప్రేరణనిస్తోందన్నారు