
నివాళులు అర్పించిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజ్
మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అంబర్ పేట, మరియు అడిక్ మెట్ లలో జ్యోతి రావు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజ్ గారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు, మరియు కుల వివక్ష, మత వివక్షను వ్యతిరేకించాడు.
విద్యతోనే ఈ దేశంలో మార్పు సాధ్యమైతది అని చెప్పిన వ్యక్తి.
ఈ దేశంలోనే శూద్రుల కోసం 1848 లోనే మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేశాడు.
బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మాత్మ జ్యోతిబాపూలే .
1873లో సత్యశోధక్ సమాజ్ ని స్థాపించాడు. దీని ముఖ్య ఉద్దేశం శూద్రులను బ్రాహ్మణుల యొక్క చెర నుంచి కాపాడడం.
గులాంగిరి, ఈశ్వర అనే పుస్తకాలను రచించాడు.
1882లో పూలే గారు హాంటర్ కమిషన్ను కలిసి అతిసూద్రులు (SC , ST) శూద్రులు ( BC ) కోసం ప్రత్యేక పాఠశాలలను నిర్మించాలని బెస్ట్ రిపోర్టును అందించాడు. 1888 లో మహాత్మా అనే బిరుదును పుణె యూనివర్సిటీ అందచేసింది.
ప్రార్థన సమాజం, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం శూద్రులు, అతిశూద్రులకు చేసింది ఏమీ లేదని బహిరంగంగా ప్రశ్నించాడు.
దుర్మార్గమైన కుల వివక్ష, మత వివక్ష ఈ దేశంలో సమూలంగా భూస్తాపితం కావాలని చెప్పాడు.
1891లో సార్వజనిక్ సత్త ధర్మ పుస్తకాన్ని రచించాడు* ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు జెల్ల బిక్షపతి, రాజేష్, నాగ సాయి, శ్రీనివాస్, సుదర్శన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.