
education breaking news today
—SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం
జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కళాశాల నూతన కమిటీ ఎన్నికకు SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వా పాఠశాలలో సరైన వసతులు లేవని మండిపడ్డారు … ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో పెండింగ్ స్కాలర్షిప్ ఉన్నాయని అన్నారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు… అదేవిధంగా సాక్షతూ సిఎం మనుమడే గచ్చిబౌలి బాలికల పాఠశాల గురించి వివరించి టాయిలెట్స్ లేకపోవడంతో కోన్ని నిధులు పెట్టి మరమ్మతులు చేశారు. ఆలాంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. కెజిబివిలను కళాశాలకు ఆఫ్ గ్రేడ్ చేసి కనీసం భవనాలు లేకుండా పాఠశాలలోనే తరగతులు, డార్మెటరి నిర్వహిస్తున్న డైరెక్టర్ దేవసేవ గారు ఎక్కడ పర్యటించలేదు. కనీసం పట్టించుకున్న సందర్భం లేదు.
మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్న చౌడరం మోడల్ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయరు. కానీ నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
24 వేల టీచర్స్ పోస్టులు భర్తీ లేదు, 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు పెంచలేదు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన ఉండదు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ నిర్మాణం ఉండదు. “మన ఊరు-మన బస్తీ-మన బడి” పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే చోద్యం చూశారు తప్ప కనీసం విచారణ లేదు. విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన గారు తక్షణమే మన ఊరు, మనబస్తీ, మన బడి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి. అని డిమాండ్ చేశారు
ఈ మద్యనే విడుదల అయినా పిజీఐ రిపోర్ట్ నివేదికలే చెబుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుంది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో అనేక సమస్యలు ఉన్నాయని నిన్నా స్టేషన్ ఘనపూర్ ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహంలో అనేక సమస్యలు వచ్చాయని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షణ లేదని అన్నారు ప్రభుత్వా పాఠశాలలో మరియు సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. SFI జిల్లా అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన ప్రభుత్వా డిగ్రీ కళాశాల నూతన కమిటీ అధ్యక్షులు గా నజియ కార్యదర్శిగా బాలు ఉపాధ్యక్షులుగా పల్లవి, కృష్ణ వేణి, కల్పన, సహాయ కార్యదర్శిగా కమలాకర్, రహేన లను ఎన్నుకున్నారు