పెనుబల్లి మండలం, మండాలపాడు గ్రామానికి చెందిన తడికమల్ల తాతారావు - పద్మ దంపతుల కుమార్తె, గ్రామ సర్పంచ్ మంగమ్మ మనవరాలు సౌమ్య శ్రీ J.E.E అడ్వాన్స్ లో 992 ర్యాంక్ తో అస్సాం రాష్ట్రంలోని గోవతి లో ఐ.ఐ.టి E.C.E లో సీటు సాధించగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించి రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారథి రెడ్డి సహకారంతో విద్యార్దినికిని ల్యాబ్ టాప్ ను అందజేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తన ఉన్నత చదువులకు, కోర్సులు నేర్చుకోవడానికి సహకారంగా ల్యాబ్ టాప్ ను అందించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారథి రెడ్డి విద్యార్థిని సౌమ్య శ్రీ, తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు