విద్యార్థులకు బ్లాంకెట్లు అందజేత
జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే వారు బొకేలు,పుష్పగుచ్ఛాలకన్నా పేద విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలంటూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చేసిన సూచనకు మంచి స్పందన లభించింది.ఈ సూచన మేరకు అధికారులు,ఇతరులు తీసుకువచ్చిన బ్లాంకెట్లను మంగళవారం స్టేషన్ ఘనపూర్ లోని ప్రభుత్వ బాలుర,బాలికల బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు పంపిణీ చేశారు.ప్రస్తుతం తీవ్ర చలి నెలకొన్న నేపథ్యంలో తమకు బ్లాంకెట్లు అందించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సహాయానికి గాను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ,సంక్షేమ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.