
E69 న్యూస్ శాయంపేట జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలం లోని పత్తిపాక గ్రామానికి చెందిన పులిమాటి దివ్య ఓంకార్ దంపతుల కుమార్తెలు అయినా పులిమాటి సాగ్నిక మరియు నిశ్వికలకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. పోయిన సంవత్సరం ఇదే ఓంకార్ దివ్య దంపతుల పెద్ద కుమార్తె సాగ్నికాకు ఆవర్తన పట్టిక లోనే 118 మూలకాలు 30 సెకండ్లలో చెప్పడం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, కలాం వరల్డ్ రికార్డ్, జాకీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చాయి.
దేశంలోని రాష్ట్రాలు రాజధానుల పేర్లు 20 సెకండ్లలో చెప్పడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్, 60 సెకండ్లలో 38 అబ్రివేషన్స్ చెప్పడం ద్వారా ఎక్స్క్లూజివ్ వరల్డ్ రికార్డ్, ఇలా ఆరు రికార్డులు వచ్చాయి. ఈ సంవత్సరంలో బ్రాంచెస్ ఆఫ్ స్టడీస్ ని 30 సెకండ్లలో 34 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది. చిన్న పాప నిశ్విక స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ 35 సెకండ్లలో మరియు వెజిటబుల్స్ అనిమల్స్ కలర్స్ ఇండోర్ గేమ్స్ యాక్షన్స్ రైమ్స్ ఇలా 12 రకాల కేటగిరీలలో కలిపి చెప్పడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది.
వారిని ఈరోజు శాలువాతో సన్మానం చెసిన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు వారి వెంట జిల్లా నాయకులు మండల నాయకుల తదితరులున్నారు.