
విద్యార్థులు,యువత జీవితాల్లో వెలుగులు నింపుతాం
బిఎస్పీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థులు,యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హన్మకొండలోని డా.నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో మంగళవారం జరిగిన బహుజన విద్యార్థి గర్జనకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు తదనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.రాష్ట్రంలోని విద్యార్థు లు,యువత కోసం పార్టీ ఎన్నికల డిక్లరేషన్ను ప్రకటించారు. లక్షలాది మంది పేద విద్యార్థులు, యువతకు జీవితాల్లో మార్పుతేవడానికే పార్టీ డిక్లరేషన్ ప్రకటించినట్లు తెలిపారు. మహాత్మ జ్యోతిరావ్ పూలే విద్యా భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్శిటీల్లో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.పేద విద్యార్థుల కలగా మిగిలిపోకూడదన్న లక్ష్యంతో ప్రతి మండలం నుంచి ఐదుగురు విద్యార్థులను విదేశీ విద్యకు ఎంపిక చేస్తామన్నారు.ప్రతి జిల్లాకు ఒక సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు.ప్రతి ఏడాది ఒక విద్యార్థిపై 75 వేల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు.పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నాలుగో భాషగా కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడతామన్నారు.విద్యార్థులకు మెట్రోతో సహా, ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు.
అన్ని గ్రామాలల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు రీడింగ్,కోచింగ్ కేంద్రాల కోసం జాంబవ స్టూడెంట్ స్పార్క్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామ న్నారు ఉద్యోగ హక్కు చట్టం తీసుకువచ్చి,రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.ప్రతి గ్రామంలో విద్యార్థుల కోసం ఏసీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.పండగ సాయన్న నవచేతన యువ సహకార సంఘాలు ఏర్పాటుచేసి 15 లక్షల గ్రాంట్, 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామ న్నారు.ప్రభుత్వ కాంట్రాక్టుల్లో యువజన సహకార సంఘాలకు 25 శాతం కాంట్రాక్టులు కేటాయిస్తామ న్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం ఆధిపత్య వర్గాలకు మాత్రమే కాంట్రాక్టులు కేటాయిస్తుందని విమర్శించారు. మాన్యశ్రీ కాన్షిరాం స్ఫూర్తితో యువతను నాయకులుగా తీర్చిదిద్ది వారికి స్థానిక సంస్థల్లో యువతకు 30% రాజకీయ రిజర్వేషన్లు కల్పించి,ప్రభుత్వ శాఖల్లో షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు.ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకంగా గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.అదేవిదంగా మూడు ప్రాంతీయ కళా సంస్కృతి కేంద్రాలను ఏర్పాటు చేసి,జానపద కళలు, గ్రామీణ సంస్కృతినిప్రోత్సహిస్తామన్నారు.యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయుటకు అత్యాధు నిక మౌలిక సదుపాయాలతో ప్రతి జిల్లాలో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.కొత్త వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలతోపాటు,రాయితీలు కల్పిస్తామన్నారు.
శ్రీకాంతాచారి ఉద్యోగహామీ ద్వారా ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, సూపర్ లీకేజీ లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 5 లక్షల మంది యువతకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా నియమించి,ప్రతి నెల రూ.20,000 ఉపకారవేతనాన్ని అందజేస్తామన్నారు. 60 రోజుల్లో యువతకు నైపుణ్యం కల్పిస్తామన్నారు.పూర్ణ-ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రతినెల రూ.15,000 ఉపకార వేతనం, క్రీడా పరికరాలు పోషకాహారాన్ని అందజే స్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన క్రీడా ప్రాంగణా లు నిరూపయోగంగా ఉన్నాయన్నారు. సీనియర్ సిటీజన్స్ కోసం ప్రత్యేక విధానాలు రూపొందిస్తా మన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తం గా కాంట్రాక్టు అధ్యాపకులతో యూనివర్సిటీలో నడవడం దుర్మార్గమన్నారు.కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ శిథిలావస్థలో ఉందన్నారు.విద్యార్థుల త్యాగా లతో ఏర్పడ్డ తెలంగాణ కొంతమంది చేతిలో బందీ అయిందన్నారు. పేదల బతుకులు వెలుగులు నింపేం దుకే తన అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేటితో రెండేళ్లు పూర్తి అయ్యిందని అన్నారు ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అయితే ప్రతి విద్యార్థి ముఖ్యమంత్రి అయినట్లేనని ప్రకటించారు విద్యార్థుల ను ఉద్దేశించి కాబోయే ఎమ్మెల్యేలు,మంత్రులు ముఖ్య మంత్రులు మీరేనంటూ సభలో సంభోదించారు.
ఐఐఐటి బాసర విద్యార్థులు రోజుల తరబడి సామూహిక నిరాహార దీక్ష చేశసినా ముఖ్యమంత్రి పర్యటించి, వర్సిటీ సమస్యలు పరిష్కారించలే దన్నారు. మన ఊరు -మన బడి పథకం నిధుల్లో వేల కోట్ల కాంట్రాక్టులు బడా బాబులకు కట్టబెట్టారన్నారని విమర్శించారు.జనాభాలో 99 శాతం ఉన్న పేద వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్నదే బిఎస్పీ లక్ష్యమన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే పేదల అసైండ్ భూములను ప్రభుత్వం వేలం వేస్తుందన్నారు.ధరణి పేరుతో పేదల అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలో నమోదు చేసి, ప్రభుత్వం మాత్రం వందల ఎకరాల భూములను ప్రయివేట్ కంపెనీలకు బహిరంగ వేలంలో అమ్ముతుందని అన్నారు. రాష్ట్రంలో 30 వేల ఎకరాల భూములను ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా గుంజుకుందన్నారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే ఎస్సీ,ఎస్టీ,బీసీ రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్న ప్రతి అడుగు జాగను తిరిగి రైతులకు పంచుతామన్నారు. కోకాపేటలో వేలం వేసిన భూముల్లో దక్కించుకున్న రెండు కంపెనీలు గజం చొప్పున అప్పుడే ఫ్రీ లాంచ్ ఆఫర్స్ ప్రకటించారని అన్నారు. హెచ్ఎండిఏ,రేరా పర్మిషన్ రాకుండానే అమ్మకానికి పెడుతున్నారని ప్లాట్ల కొనుగోలుదారులు జాగ్రత్త వహించాలన్నారు.ప్రజా గాయకుడు గద్దర్, ఉర్దూ వార్తపత్రిక జహిరుద్దీన్ అలీఖాన్ మృతి చెందడం అత్యంత విషాదమన్నారు.వరంగల్ పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మడికొండ నుండి మొదలైన బైక్ ర్యాలీ అమరవీరుల స్థూపం మీదుగా పబ్లిక్ గార్డెన్ లోని సభాస్థలికి భారీ ర్యాలీతో చేరుకుంది. ఈ సందర్బంగా డప్పు కళాకారులతో కలిసి డప్పు కొట్టి దరువు వేశారు.సభలో రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్,రాష్ట్ర ఈసీ మెంబర్ బోట్ల కార్తీక్హనుమకొండ జిల్లా అధ్యక్షులు శనగరపు రాజు,హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ బొల్లంపల్లి సారయ్య,బీఎస్పీ వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్,వర్ధన్నపేట నియోజకవర్గ నిర్వాహక ఇన్చార్జి మాదారపు రవికుమార్,వరంగల్ రీజియన్ సెక్రెటరీ కన్నం సునీల్,జనగామ జిల్లా బసవగల్లు బసవగళ్ల సిద్దయ్య,స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లపల్లి వెంకటస్వామి ములుగు జిల్లా అధ్యక్షులు శనిగరపు నరేష్, పసులాది ముఖేష్,భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు దూడపాక సుమన్,మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ ఎల్.విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు.