
విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలి
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని కేజీవీబీ పాఠశాలను జిసిడిఇఒ గౌస్య బేగం సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా జాతీయ కరాటే పోటీలో సీఎం కేసీఆర్ మెగా కప్పును సాధించిన విద్యార్థులను వారు ప్రశంసించారు.అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలని ఆత్మ సైర్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు హిత బోధ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఒ స్వప్న,ఉపాధ్యాయులు మరియు వ్యామ ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి,కోచ్ & రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నెపు రాజేంద్రం పాల్గొన్నారు.