
విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జిల్లాలో మర్కజి స్కూల్ ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాల లో 1996 97 విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు కలుసుకొని ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకొని అనుభూతులు పంచుకున్నారు. 25 సంవత్సరాల క్రితం చదువుకున్న మిత్రులు నేడు ఎంతో మంది ఆర్థికంగా విదేశాల్లో స్థిరపడి సంతోషంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ లో తమకు విద్య నేర్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే (స్నేహితుల దినోత్సవం) సందర్భంగా తామంతా కలిసినట్లు వరంగల్ ప్రెస్ క్లబ్ ట్రెజరర్ అమర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ సారంగపాణి సతీష్ కుమార్ రాజ్ కుమార్ ప్రవీణ్ కుమార్ విజయ్ రామకృష్ణ సంతోష్ సంజయ్ సందీప్ అశోక్ తదితర మిత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమకు విద్య బోధించిన గురువులను ఘనంగా సన్మానించుకోవాలని తీర్మానం చేసుకున్నారు.