
విద్యార్థుల యూనిఫామ్ కుట్టు కోసం మహిళా సమాఖ్యలకు అవగాహన
ఈ69 హనుమకొండ/స్టేట్ బ్యూరో రిపోర్టర్ మహమ్మద్ సలీం
హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం కుట్టు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇది రెవెన్యూ అధికారి మరియు PD-MEPMA ప్రాజెక్టు డైరెక్టర్ Y.V.గణేష్ ఆధ్వర్యంలో జరిగింది.హన్మకొండ,కాజీపేట,పరకాల,హసన్‌పర్తి మండలాల్లోని 141 పాఠశాలలలో 12,000 మంది విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన యూనిఫామ్ అందించాలన్నారు.కొలతలతో పాటు నిర్దేశిత నమూనాలో డబుల్ కుట్టుతో దుస్తులు కుట్టాలని సూచించారు.తరగతుల వారీగా అబ్బాయిలకు నిక్కర్-చొక్కా, ప్యాంట్-చొక్కా,అమ్మాయిలకు లాంగ్ ఫ్రాక్,లంగా-చొక్కా,పంజాబీ డ్రస్‌లు కుట్టాలన్నారు.ప్రతి జతకు రూ.75 చొప్పున కేటాయించబడిందని,మే 31వ తేదీలోపు డ్రెస్‌లను పాఠశాలలకు అందించాలన్నారు.కార్యక్రమంలో విద్యాశాఖ,MEPMA అధికారులు పాల్గొన్నారు.