
మరిపెడ మండలంలో ఎల్లంపేట శివారు సోమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని భూక్య పాప, అజ్మీర సురేష్ లకు చెందిన రెండు పశువులు శుక్రవారం ఉదయం 7 :30 నిమిషాలకు విద్యుత్ తీగలకు తగిలి చనిపోవడం జరిగింది. విద్యుత్ తీగలు స్తంభానికి కిందికి వేలాడడం వలన పశువులకు తగిలి రెండు ఆవులు చనిపోవడం జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన రెండు ఆవులు చనిపోవడం జరిగిందని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 1,50,000 విలువ గల ఆ పశువులు చనిపోవడం వల్ల ఆ కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. తక్షణమే ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలని గ్రామ పెద్దలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.