విద్యుత్ కార్మికుల సమస్యల సాధనకై రిలే నిరాహార దీక్ష
Hyderabadజి టి ఎస్ కాలనీ ఈరోజు ప్రారంభించిన సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాపర్తి అశోక్ ,జే బసవరాజ్ ,ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కోశాధికారి బసవరాజ్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ విషయంలో మంచి పేరు తెచ్చి ఎండ వాన అనక రాత్రి పగలు కష్టపడుతూ పనిచేస్తూ కరెంటు స్తంభాలపైన పిట్టల్లా రాలిపోతున్న కూడా 24 గంటల కరెంటు రాష్ట్రంలో ఈరోజు వస్తుందంటే విద్యుత్ కార్మికుల శ్రమ ఫలితమే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ అసమెన్ గ్యాంగ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఆర్టిజన్స్ అందరినీ ఆరవతలను బట్టి జేఎల్ఎం జూనియర్ అసిస్టెంట్ సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్స్ ఇవ్వాలి, విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ర్గేసే చెల్లించాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ప్రతి 33/11 కెవి సబ్ స్టేషన్ లో నాలుగవ ఆపరేటర్ ,వాచ్మెన్ నియమించాలి. ట్రాన్స్కో సిబిడి ఎస్ఎంజి కార్మికుల కు గతంలో ఇచ్చిన గ్రేడ్ వన్ జీతం ఇవ్వాలి, బిల్ కలెక్టర్స్ మీటర్ రీడర్స్ ఎస్ పి ఎం లకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలి, ట్రాన్స్కో, జెన్కో డిస్కంలో ఉన్న సెక్యూరిటీ గార్డులందరినీ ఆర్టిజన్ గా గుర్తించి జీవో నెంబర్ 21 గెజిట్ చేసి 24000 చెల్లించాలి, అర్హులైన వారందరికీ ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి, 2011 ఏరియర్స్ ఇవ్వాలి రిటైర్ అయిన ఉద్యోగులను సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా నియమించవద్దు విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతాం ఈనెల 15వ తేదీన చలో హైదరాబాద్ పార్క్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకన్న, జి మహేష్ ,సిహెచ్ శ్రవణ్ కుమార్ ,జి రవీంద్రబాబు ,ఆర్ లింగన్న ,బి బీరయ్య, నవీన్ కుమార్ ,దేవేందర్ రెడ్డి ,బి సురేష్ తదితరులు పాల్గొన్నారు