
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం మేకల గట్టు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతుకానికి గురై స్తంభం పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడిన గ్రామపంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజుకు పంచాయతీరాజ్ శాఖ నుండి ప్రభుత్వం బాధ్యత వహించి మెరుగైన వైద్యం అందించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్(సిఐటియు )జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సిహెచ్ మల్లాచారి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ..మేకల గట్టు గ్రామపంచాయతీ కార్యదర్శి ఒత్తిడి మేరకు గత మూడు రోజుల నుండి గ్రామంలో పంచాయతీ కార్మికులు వీధిలైట్లు వేస్తున్నారని వేల్పుల నాగరాజు అనే వ్యక్తి గతంలో కారోబారని మల్టీ పర్పస్ వర్కర్ విధానం పేరుతో అన్ని పనులు అందరు చేయాలని కార్మికులను ఒత్తిడి చేయడం ఫలితంగా విద్యుత్ స్తంభానికి వీధిలైట్లు వేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడడం దారుణమని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చి గ్రామపంచాయతీ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని తీవ్రంగా మండిపడ్డారు ట్రాక్టర్ నడపరాని వాళ్ళ తోటి ట్రాక్టర్ నడిపించడం కరెంటు గురించి తెలవని వాళ్లతోటి కరెంట్ పని చేయించడం ఫలితంగా పంచాయతీ కార్మికుల ప్రాణాలు గాలిలో దీపములుగా మారాయని వెంటనే మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మేకల గట్టు కారోబార్ వేల్పుల నాగరాజు విద్యుత్ ప్రమాదానికి కారణమైన సంబంధిత పంచాయతీ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు బి బాల నరసయ్య పగిడిపల్లి మల్లేష్ ఉమ్మగొని రాజేష్ బి సత్యనారాయణ కొయ్యడ బిక్షపతి ఎన్ రాజు తూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.