ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ విద్యుత్ షాక్ కు గురై దుక్కిటేద్దులు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాక పల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే రేపాక పల్లి గ్రామానికి చెందిన కసుభోజల ఉపేందర్ కు చెందిన దుక్కిటేద్దులు ఈరోజు అనుకోకుండా విద్యుత్ షాక్ తో మృతి చెందాయి వీటి విలువ దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంటాయని తోటి రైతులు పేర్కొన్నారు. చల్లగరిగ సబ్ స్టేషన్ లైన్ వలన తనకు జీవనాధారమైన దుక్కిటేద్దులు మృతి చెందాయని రైతు బోరున విలపించాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన తాను జీవనోపాధి కోల్పోయానని రైతు వాపోయాడు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి రైతుకు తగిన విధంగా న్యాయం చేయాలని రేపాకపల్లి గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు చెప్పిన విద్యుత్ లైన్లను సరి చేయకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు రైతులు వాపోయారు.