ఘట్కేసర్:జనగామ నియోజకవర్గం అడవికేశవపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భాదవత్ మోహన్ విద్యుత్ స్తంభం మీద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వెంటనే అతన్ని ఘటకేసర్లోని నీలిమ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం నేరుగా ఆసుపత్రికి చేరుకుని మోహన్‌ను పరామర్శించారు. వైద్యుల నుంచి మోహన్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోహన్ పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.