వినాయక మండపం వద్ద భక్తులకు అన్నదానం
Mahabubabadగణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పూల బజార్ సునార్ సంఘము ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిధిగా 7 వ వార్డ్ కౌన్సెలర్ ఊరుకొండ శ్రీనివాస్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వారు విగ్నేశ్వరుని పూజించడం ద్వారా విఘ్నాలు తొలగి విఘ్నేశ్వరుడు కరుణ కటాక్షాలతో కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని,చేస్తున్న వ్యాపారాల్లో లాభ ప్రేక్ష ఉండే విధంగా విఘ్నేశ్వరుని చల్లని చూపులు అందరిపై ఉండాలని కోరారు. పాడిపంటలు సమృద్ధిగా పండి భక్తి శ్రద్దలతో కోలుచుకుంటున్న భక్తులకు ఎల్లప్పుడూ గణేశుడి ఆశీస్సులు ఉంటాయన్నారు.అనంతరం సునార్ సంఘం గణేశుడి కమిటీ నిర్వాహకులు వార్డ్ కౌన్సిలర్ ఊరుకొండ శ్రీనివాస్ కు శాలువాతో సత్కరించారు.ప్రతి ఏటా విఘ్నేశ్వరుడి మండపం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహ దాత మౌర్య రమేష్,ఆడానియా లాల్ సింగ్,మాలి గోపాల్ సింగ్,మునవర్ వీరన్న,మౌర్య శ్రీను,మౌర్య సతీష్,ఆడానియా ప్రేమ్,ఆడానియా ముకేష్,మాలి పుల్ సింగ్,మునవర్ సింకిందర్,భూక్య రవి,బాధవత్ శ్రీనివాస్,తునగర్ సురేష్,మునవర్ రాజేష్,సహదేవుడా నగేష్,మునవర్ అనిల్,సునీల్,మౌర్య రవి,యూత్ రాజేష్,గణేష్,రాకేష్, కాలనీవాసులు,మహిళా భక్తులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.