వీర తెలంగాణ సాయుధ సమరంలో నెత్తురొడ్డిన తమ్మడపల్లి జి
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పురిటి గడ్డ జనగామ జిల్లా పాలకుర్తి కి సుమారు 10 కిలోమీటర్ల సమీపాన గుత్పల తమ్మడపల్లి ఉంటుంది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఈ గ్రామం నిర్వహించిన పాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగినది
భూమికోసం బుక్తి కోసం దున్నేవానికి భూమి వెట్టిచాకిరి రద్దు స్వేచ్ఛ సమానత్వం నిజాం నిరంకుశ పాలన నుండి భూస్వాములు రజాకార్లు ఆగడాలు దోపిడీ దుర్మార్గాల నుండి పీడిత ప్రజలను విముక్తి చేసిన ఘన చరిత్ర ఎర్రజెండాది కమ్యూనిస్టులదే
కమ్యూనిస్టుల నాయకత్వాన గ్రామంలో ప్రజలందరినీ చైతన్యం చేసి సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులకు రహస్య కేంద్రంగా కీలక పాత్ర పోషించింది
ముఖ్యమైన ఘట్టాలు నేపథ్యం
1946 జూలై 4న కడవెండి
గ్రామంలో తొలి అమరుడైన కామ్రేడ్ దొడ్డి కొమురయ్య అమరత్వం కు ముందే గ్రామ గ్రామాన కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో గుత్పుల సంఘం కమిటీలు వేశారు ఆ క్రమంలోనే తమ్మడపల్లిలో గుత్పల సంఘం ఏర్పడింది సంఘం నిర్వహించిన కార్యక్రమాల కారణంగానే గుత్పల తమ్మడపల్లిగా పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది.
గెరిల్లా దళంలో 1946 సెప్టెంబర్ 11న కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా గ్రామానికి చెందిన కొంతం సోమయ్య కమ్యూనిస్టు (రాపర్తి) మల్లయ్య నక్క పోషాలు ఐరోన్ల ఐలయ్య లోకిని ఎల్లయ్య ఈ ఐదుగురు బొమ్మెరకంచెలో ఏర్పాటు చేసిన రహస్య సమావేశానికి హాజరై పార్టీ ఆదేశం మేరకు గెరిల్లా దళంలో చేరి పని చేశారు ఈ సమావేశానికి కమ్యూనిస్టు పోరాట యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి నల్ల నరసింహులు యాదగిరి రావు హాజరైనట్లు తెలిసింది.
జైత్రయాత్ర కార్యక్రమం
కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నల్ల నరసింహులు యాదగిరి రావు నేతృత్వంలో 1946 లో జైత్రయాత్ర కార్యక్రమం తమ్మడపల్లి గ్రామంలో జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఊరేగింపు ర్యాలీ నిర్వహించి గ్రామం సెంటర్లో వీర మల్లమ్మ ఇంటి ముందు నల్ల నరసింహులు ఎర్ర జెండా ఆవిష్కరణ చేశారు ఎర్ర జెండాను చూసి ప్రజలు పులకించిపోయారు అక్కడే ఉన్న పెద్ద వేప చెట్టు పైన యువకులు ఎర్రజెండాలు కట్టి ఉత్తేజం పొందారు.
జఫర్ గడ్ రజాకార్ క్యాంపు
నిజాం సంస్థానంలో సాయిధ తిరుగుబాటును అణిచివేసేందుకు ఖాసింరజ్వి రజాకార్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో జఫర్గడ్ కేంద్రంగా రజాకార్ క్యాంపు ఖాదర్ అలీ నాయకత్వం 50 మందితో ఏర్పడింది ఖాదర్ ఆ లి 15000 ఎకరాల భూస్వామి జఫర్గడ్ వడ్డే గూడెం తమ్మడపల్లి ఓబులాపురం షాపేల్లి సూరారం తిమ్మాపురం గ్రామాలలో పోలీస్ పటేల్ గా పెత్తనం చెలాయించేవాడు ఈ గ్రామాలలో ఖాదర్అలి గుండాలు రజాకార్లు దాడులు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారాలు దుర్మార్గాలకు హద్దు అదుపు లేకుండా ఉండేది.
ఆహార ధాన్యాల తరలింపును ప్రతిఘటించిన ప్రజలు
రెండో ప్రపంచ యుద్ధ కాలం ఆహారధాన్యాల కొరత తీర్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సహాయం కోరిందని నిజాం సంస్థానంలో ఆరధాన్యాలను దౌర్జన్యంగా రైతుల నుండి వసూలు చేశారు.ఈ గ్రామంలో పోలీస్ పటేల్ ఆధ్వర్యంలో వసూలు చేసిన ఆహార ధాన్యాలు రైతుల ఇండ్లకు తీసుకపోకుండా షావుకారి ఇమ్మడి లచ్చయ్య ఇంట్లో పోశారు ఈ బలవంతపు ఆహార ధాన్యాల వసులు ఆపాలని వసూలు చేసిన ఆహారధాన్యాలను తిరిగి ప్రజలకే ఇవ్వాలని కోరుతూ గ్రామ రక్షక దళం ఆధ్వర్యంలో తమ్మడపల్లె లో ధాన్యాన్ని బయటికి పంపకుండా అడ్డుకున్నారు తిరిగి ప్రజలకే పంచిపెట్టారు ఈ గ్రామంలో మొదటిసారిగా గొప్ప తిరుగుబాటు గా చెప్పుకోదగినది
రజాకార గుండాల మొదటి దాడి
గ్రామంలో సేకరించిన ఆహార ధాన్యాలను పంపియకుండా అడ్డుకున్నారని కోపంతో రగిలిపోయిన గ్రామ పోలీస్ పటేల్ భూస్వామి ఖాదర్ అలి హనుమకొండ లో ఉన్న నిజాం ప్రభుత్వం లో అధికారైన సుబేదార్ కి సమాచారం అందించారు ఈ వార్త తెలిసిన సుబేదార్ మరుసటి రోజున గుర్రపు బండి లో రజాకార్లను వెంటబెట్టుకొని గ్రామం పై దాడి చేసేందుకు ఊరుపక్కనే ఉన్న చింత చెట్ల వద్ద మాటు వేసినారు కాగా ఈ వార్త తెలిసిన గ్రామ పట్వారి ఉద్దం రాజు లక్ష్మీనారాయణ రావు రజాకారులను గ్రామంలోకి రాకుండా అడ్డుకోవాలని గ్రామస్తులతో అన్నారు పట్వారి చెప్పిన మాటలకు గ్రామంలో ఉన్న యువకులు ప్రజలు అలర్ట్ అయ్యారు తమ వద్ద ఉన్న వడిశాలలు గుతుప కట్టెలు కారంపొడి ఏది దొరికితే అది పట్టుకొని రజాకారులను తరిమికొట్టేందుకు ఊర్లోకి రాకుండా సిద్ధపడ్డారు ప్రజలంతా ఐక్యమై తిరగబడుతున్నరని ఎలాగైనా బెదిరించి లొంగ తీసుకోవాలి అని రజ కారులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో మంగలి సోన్నాయిల వెంకటమల్లు ఈ గ్రామంలో తొలి అమరుడైనాడు రంగు రోశయ్యకు దండ రెక్కల నుండి తూటా దూసుకెళ్లి గాయపడ్డాడు ఈ ఘటన జఫర్గడ్ రధాకర్ క్యాంపు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు తిరుగుబాటు ప్రభావాన్ని చైతన్యాన్ని రగిలించింది
కమ్యూనిస్టు నాయకుల ఇండ్లు తగలబెట్టడం
నిజాం సర్కార్ భూస్వాములకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారని రజాకారులు గ్రామం పై దాడి చేసి గ్రామ కమ్యూనిస్టు నాయకులైన రాపర్తి ఎర్రభీమయ్య నక్క పోశాలు దుద్యాల నరసయ్య ల ఇండ్లను తగలబెట్టారు
చిత్రహింసలు పెట్టి చెట్లకు వేలాడదీసి కొట్టడం
నైజాం రజాకార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ కమ్యూనిస్టులు పనిచేస్తున్నారని కమ్యూనిస్టు నాయకుల ఆచూకీ తెలపాలని వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను వారి అనుచరులను గ్రామం నుండి పట్టికెళ్ళి అ పక్కన ఉన్న గూడూరు గ్రామ భూస్వామి విసునూరు దేశముకు రామచంద్రారెడ్డి ఏజెంట్ అయిన కోడూరు నారాయ్య దొర గుండాలు నక్క నరసయ్య మారపల్లి సోమయ్య పెద్దూరి బక్కయ్య లోకిని పాపమ్మ కొంతం నరసయ్య కొంతం కొమురయ్య కొంతం చంద్రయ్య బైండ్ల చెన్నమల్లు పడిశాల దానయ్యలను వారం రోజులకు పైగా గడిలో నిర్బంధించిన కమ్యూనిస్టుల రహస్య సమాచారం చెప్పకపోవడంతో వదిలిపెట్టారు
ఒకే రోజు 12 మందిని కాల్చి చంపిన ఘటన
భూస్వామ్య గుండాలు రజాకారులు గ్రామం పై దాడి చేసి పోరాట యోధులను దొరికితే చంపాలని దొరికిన వారిని దొరికినట్లు 20 మందిని తాళ్లతో బంధించి ఊరు పక్కన దొంతురి వాళ్ళ బాయి గడ్డకు తీసుకెళ్లి వరసగా నిలబెట్టి అమానుషంగా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఒకేరోజు 12 మంది వీరమరణం పొందారు మిగతా వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు మరణించిన వారిలో పోరాట యోధులు చాడ అనంతరెడ్డి దిడ్డి పెరమయ్య బత్తిని బక్క రాజయ్య దొంతూరి నర్సయ్య దుద్యాల చిన్న నరసయ్య చెదలు నరసయ్య అంగిడి ఇద్దయ్య షాపెళ్లికి చెందిన కుంట పెద్దపురం గంట్లకుంట కు చెందిన బోనగిరి నరసయ్య లను కాల్చి చంపారు ఎండి పెద్ద నాసర్ ఎండి బుచ్చినాసర్ గుజారి కర్రే రామయ్య శ్రీరాముల మల్లయ్య వల్లాల బుచ్చయ్య అన్యపు నరసయ్య దిడ్డి రంగయ్య లు తూటాలు దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డారు తమ్మడపల్లి గ్రామం రక్తసిక్తం అయింది.ఈ ఘటన మరువక ముందే కొద్ది రోజులకే రజాకారులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని జఫర్గడ్ రజాకార్ల క్యాంపుకు రక్షణగా ఉన్న పిరంగులు పేలకుండా నీళ్ళు పోశాడనే నేపంతో గ్రామానికి చెందిన పోరాటయోధుడు మహమ్మద్ ఖాసింను క్రూరంగా హింసించి కిరాతకంగా రజాకారులు ఖాదర్ అలీ గుండాలు కొత్త కుంట వద్ద కాల్చి చంపారు.మరోసారి కృష్ణమూర్తి దళం పేరుతో మారువేశాలలో రజకారులు వచ్చి కమ్యూనిస్టులను చంపాలని కుట్ర చేశారు.పసిగట్టిన కమ్యూనిస్టు నాయకులు తప్పించుకున్నారు.ఈ ఘటన తర్వాత అనేక మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
జఫర్గడ్ ఖాదర్ అలీ బంగ్లాపై మెరుపు దాడి
కమ్యూనిస్టులను ప్రజలను క్రూరంగా హింసించి వారి మానప్రాణాలను బలిగొంటున్న ఈ ప్రాంత భూస్వామి ఖాదర్ అలీ గుండాలు రజాకారులకు తగిన బుద్ధి చెప్పేందుకు కమ్యూనిస్టు గెరిల్లా పోరాట యోధులైన నల్ల నర్సింహులు నేతృత్వంలో ప్లాన్ చేశారు.తమ్మడపల్లి ఓబులాపురం జఫర్గడ్ వడ్డే గూడెం తిమ్మాపురం సూరారం షాపల్లి గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు పార్టీ ఆదేశాల మేరకు ఖాదర్ అలీ బంగ్లా పై దాడి చేశారు ఈ దాడి నుండి ఖాదర్ అలీ తప్పించుకున్నాడు. ఖాదరలేని కాపాడుకునేందుకు రజాకారులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు.రజాకారుల కాల్పుల నుండి ప్రజలు తప్పించుకున్నారు.ప్రజల దాడిలో ఇద్దరు రజా కారులు చంపివేయబడ్డారు ప్రాణాలతో బయటపడి తప్పించుకున్న ఖాదర్ అలీ గ్రామానికి వస్తున్నాడు అనే సమాచారం తెలుసుకొని కొన్ని రోజులకు జఫర్గడ్ బయన్న గుట్ట వద్ద మాటువేసి ఖాదర్ అలీని దొరకబట్టి ప్రజలు వాడి దుర్మార్గాలకు కసిగా నరికి చంపారు
ఇంతటి గొప్ప పోరాటాన్ని చరిత్ర పుటలలో చేర్చాలి
నేటికీ తమ్మడపల్లి గ్రామం వామపక్షాలకు బలమైన కేంద్రంగా ఉంది పోరాట అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికలలో 40 సంవత్సరాలు కమ్యూనిస్టులే సర్పంచులు గా ఉన్నారు గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు
బిజెపి మతోన్మాదుల కుట్రలను తెలంగాణ సాయుధ పోరాటం పట్ల వక్ర బాష్యాలను తిప్పికొట్టేందుకు ఆనాటి ఈ పోరాట గ్రామాలే సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు గ్రామ గ్రామాన్ని అధ్యయనం చేసి ప్రజల్లో విప్లవ సాయుధ రైతాంగ పోరాట వాస్తవాలు నేటి తరానికి అందించి అమరుల ఆశయాల సాధనలో పోరాటాలకు సన్నద్ధం కావాలి.