ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకోని అధికారులు తెలుగు గళం న్యూస్ రఘునాథ్ పల్లి జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం వెల్ది గ్రామంలోని వాగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధ రాత్రి నిర్భయంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ,పోలీసుల నిఘా కొరవడి టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు.అధికారుల అండదండలతోనే యాదేచ్చగా ఇసుక అక్రమరవాణా జరుగుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.వాగులో నుంచి అక్రమార్కులు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.