వేలేరు మహిళా సంఘానికి వీవో బిల్డింగ్ మంజూరు
హన్మకొండ జిల్లా వేలేరు గ్రామ మహిళా సంఘం వీవో బిల్డింగ్ మంజూరు అంశాన్ని సంఘ సభ్యులు బిల్లా యాదగిరి సర్పంచ్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై ఎమ్మెల్యే మహిళా సంఘం బిల్డింగ్ నిర్మాణానికి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు.మంజూరు పత్రాన్ని సర్పంచ్ వీవో సంఘ సభ్యులకు,అధికారులకు అందజేశారు.త్వరలో నూతన మహిళా సంఘం వీవో బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు సర్పంచ్ కుఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు