కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి బిడ్డలకు వరం
ముఖ్యమంత్రి సహాయనిధి అభాగ్యులకు కొండంత అండ
కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో కోటి 56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనం
శంఖుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి శాససభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. అందరికీ అందు బాటులో ఆధునిక వైద్యం అందు బాటులో ఉంచాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఅర్ సంకల్పం అని ఆయన పేర్కన్నారు. కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో కోటి 56లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి,కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అరోగ్యవంతమైన తెలంగాణా గా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయించారని తెలిపారు. అందులో బాగంగానే పల్లె నుండి పట్నం వరకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఎక్కడికక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం అంటేనే చీదరించుకునే స్థాయి నుండీ వైద్య సేవలు అంటే సర్కార్ ఆసుపత్రిలోనే అనే స్థాయికి చేర్చిన నేత ముఖ్యమంత్రి కేసీఅర్ అని ఆయన కొనియాడారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించి వదలి పెట్టకుండా ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండడంతో తెలంగాణా సమాజం వైద్య సేవలకు ప్రభుత్వ ఆసుపత్రిలకు తరలి వస్తున్నారన్నారు.పల్లే నుండి పట్టణం లోని బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిన ఘనత యావత్ భారత దేశంలో ఒక్క తెలంగాణా రాష్ట్రానికే దక్కిందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల కాలంలో నూతనంగా వివాహమైన 154 మంది కళ్యాణ్ లక్ష్మీ,షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఒక కోటి 54 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దరాలకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందిన 21 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 6,77,500 విలువగల చెక్కులను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు.లబ్ధిదారులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమతి మండల అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్,ఎంపీపీ యలక బిందు నరేందర్ రెడ్డి,జెడ్పిటిసి నలపాటి ప్రమీల శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ నిరంజన్, తాసిల్దార్ జోహార్ లాల్, పంచాయతీరాజ్ డిఇ పాండు నాయక్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్,మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు,ప్రభుత్వ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.