శానిటేషన్ సిబ్బంది వేతనాలు సక్రమంగా ఇవ్వని కాంట్రాక్టర్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెట్టాలి
Jangaon— సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి గారికి వినతి
జనగామ: వైద్య విధాన పరిషత్ పరిధిలో గల హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పేషంట్ కేర్ సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బంది వేతనాలను సక్రమంగా ఇవ్వని నంబదిత కాంట్రాక్టర్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ గారికి వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం వైద్య విధాన పరిషత్తు పరిధిలో జనగామ జిల్లా హాస్పిటల్ ఎంసి హెచ్ ఇతర హాస్పటల్ లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సానిటేషన్ సిబ్బందికి పెరిగిన వేతనాలు నెలకు 12,093 రూపాయలు ఇవ్వాలని కానీ సంబంధిత కాంట్రాక్టర్ 11 వేల రూపాయల వేతనం మాత్రమే ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు వారి వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లో ప్రతి నెల 5వ తేదిలోపు ప్రభుత్వ నిబంధనల మేరకు వారి వేతనాన్ని జమ చేయాలని డిమాండ్ చేశారు చెక్కులు ఇవ్వడం మానుకోవాలని పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని కట్ చేసిన డబ్బులను వెంటనే వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని అన్నారు చేసిన శానిటేషన్ సిబ్బందిపై వేధింపులు మానుకోవాలని ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజేందర్ సిఐటియు జిల్లా నాయకులు అన్నేబోయిన రాజు పట్టణ నాయకులు మల్లేష్ రాజు తదితరులు పాల్గొన్నారు