
station ghanpur news shivunipally news

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ శివునిపల్లి గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి మండల బీజేపీ కార్యదర్శి,గ్రామ మాజీ సర్పంచ్ బుర్ల విష్ణుమూర్తి కుటుంబ సభ్యులు మైక్ సెట్‌ను బహుకరించారు.ఆలయ అభివృద్ధిలో భాగంగా నూతన విద్యుత్ మీటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు ఆలయ సేవలో భాగమవటం తమ అదృష్టంగా పేర్కొన్నారు.గ్రామస్థుడు తోట సురేందర్ ఆలయానికి కొబ్బరి టెంకాయ కొట్టు బేసిన్‌ను బహుమతిగా అందించగా,ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.