
suryapeta news
కోదాడ పురపాలక సంఘం పరిధి లోని శ్రీరంగ పురం గ్రామంలో ఈనెల 31న జరుగబోయే బొడ్రాయి పున ప్రతిష్ట,గ్రామదేవతల విగ్రహాలకు మహిళలు పెద్ద ఎత్తున నీళ్ల బిందెలతో తరలి వచ్చి జలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా అర్చకుల మంత్రోత్సవాల మధ్య గ్రామంలోని యాగశాల వద్ద జలాభిషేకం నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు…
ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మన గ్రామం లో నేడు నిర్వహించే బొడ్రాయి, గ్రామదేవతల పున ప్రతిష్టకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని, బొడ్రాయి జాతర విజయవంతనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వర రావు , కందుల చంద్ర శేఖర్ , మాజీ కౌన్సిలర్ వనపర్తి సోమమ్మ పిచ్చయ్య , బొడ్రాయి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..