శ్రీ జంగుమాత ఉచిత కుట్టు మిషన్ శిక్షణ
Adilabadమహిళలు ఆర్థికంగా ఎదిగితేనే మహిళ సాధికారత సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వనవాసీ కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో నాగోభ విద్యార్థి నిలయంలో విజయ్ కుమార్ అగర్వాల్ గారి సహకారంతో ఏర్పాటు చేసిన జంగుమాత ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ముందుగా మహానీయుల చిత్ర పటాలకు కొవ్వొత్తులు వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని స్వయం ఉపాధి ద్వారా మహిళల ఆర్ధిక ఎదుగుదల సాధ్యమవుతుందని తద్వారా అన్ని రంగాల్లో సమానంగా రాణించవచ్చని అన్నారు. మండల పరిసర ప్రాంత గిరిజన మహిళలకు వనవాసీ కళ్యాణ్ పరిషత్ వారు ఒక గొప్ప అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్క గిరిజన మహిళ ఉచిత కుట్టు మిషన్ల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసి అర్క పుష్పలత,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, నాగోభ విద్యార్టీ నిలయ అధ్యక్షులు మారుతి డో0గ్రే మాజీ జడ్పిటిసి కనక తుకారాం, నాగోభ విద్యార్థి నిలయ గౌరవ అధ్యక్షులు సిడం భీంరావ్, కార్యదర్శి చింతవార్ ప్రకాష్ ,కోశాధికారి శంకర్ లాల్ జైస్వాల్ ,రాంరెడ్డి ,దీపక్ సింగ్ షేకవత్ ,మెస్రం జంగు,జిల్లా సంఘటన కార్యదర్శి తొడసం అజయ్, తదితరులు పాల్గొన్నారు.