హన్మకొండ కాపువాడకు చెందిన ముదస్సిర్ హుస్సేన్ ఇండో నేపాల్ గ్రామీణ క్రీడలు-2022 లో పాల్గొని షాట్ పుట్ క్రీడలో 8 పాండ్ విభాగంలో బంగారు పతాకాన్నిసాధించిన ముదస్సిర్ హుస్సేన్ ను నయీం నగర్ లో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి సన్మానించారు.
ఈ సదర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ (10.5 మీటర్లతో) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని బంగారు పతాకాన్ని సాధించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ ను ప్రత్యేకంగా అభినందించి జాతీయ స్థాయిలో రాణించి మీ తల్లిదండ్రులకు, మన నగరానికి పేరును తీసుకురావడం గొప్ప విషయమని మరిన్ని వేదికల ద్వారా ఉత్తమ ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నసీంజహాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నసీర్ తదితరులు పాల్గొన్నారు.