
షాద్ నగర్ ఏడిఏ రాజరత్నంకు పదోన్నతి
నారాయణపేట జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి
షాద్ నగర్ ఏడీఏ గా 2018 నుండి విధులు నిర్వహిస్తున్న రాజరత్నంకు పదోన్నతి లభించింది. డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి రావడంతో అగ్రికల్చర్ టెక్నాలజీ (ఆత్మ) పీడీగా నారాయణ పేట జిల్లాకు బదిలీ అయ్యారు. రాజరత్నం సౌమ్యుడిగా పేరు తెచ్చుకొని నియోజకవర్గ రైతుల మననాలు పొందారు. రైతులకు మంచి సేవలు అందించడంలో అధికారి రాజారత్నంకు పేరు ఉంది. సుదీర్ఘకాలం పాటు ఆయన ఈ నియోజకవర్గంలో విడిగా సేవలు అందించిన దాఖలాలు ఉన్నాయి.