
suryapeta news
తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కీ దక్కిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని ఎన్ఎస్పి కెనాల్ పై సంపద వనాల కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ……….తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరితహారం అనే మహోన్నత కార్యక్రమాన్ని, ప్రభుత్వం నిర్వహిస్తోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తెలంగాణలో అటవీ శాతం, గ్రీనరి శాతం ఘనంగా పెరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కీ దక్కిందని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పగా అభివృద్ధిని సాధించింది, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వకారణం అని తెలిపారు.ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కీ దక్కిందని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పగా అభివృద్ధిని సాధించిందని ఆయన అన్నారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు,మహిళా నాయకురాలు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అజయ్ కుమార్, ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, గ్రామ సర్పంచ్ ఉపేందర్,ఎంపీడీవో వెంకటేశ్వర్లు,ఇరిగేషన్ అధికారులు,అటవీశాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు, గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణ, బిఆర్ఎస్ నాయకులు యుగంధర్ రెడ్డి, ఎల్పి రామయ్య, గౌని శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, నాగబాబు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.