రాష్ట్రం లో గత 5 రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు డివిజన్ లు మరియు కాలనీల పర్యటన చేసిన వరంగల్ జిల్లా డీ సీ సీ బీ మాజీ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల పలు కాలనీలు సందర్శించిన జంగా రాఘవరెడ్డి గారు. ఈ సందర్బంగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, మరియూ నాలాల చూసి వాపోయారు.పేద ప్రజలు పెద్ద ఎత్తున జంగా రాఘవరెడ్డి గారి వద్దకు వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటూ మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడని కనీసం మాకు రోడ్డు, నాల సౌకర్యాలు కూడా సరిగా లేవని అన్నారు. గత 9ఏండ్ల బీ ఆర్ యస్ పాలనలో పేదలకు, బడుగులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని కనీసం మున్సిపల్ శాఖ మరియూ స్థానిక బీ ఆర్ యస్ నాయకులు ఇప్పటికైన మొద్దు నిద్ర వీడాలని వర్షాకాలంలో విషజ్వరాలు అధికంగా ప్రభలే అవకాశం ఉన్న పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కావునా ఇలాంటి అసమర్ధత,అవినీతి ప్రభుత్వాన్ని పాతర పెట్టాలని రాబోయే కాలంలో కాంగ్రెస్ గెలవగానే మొదలు పేద, బడుగు బలహీన వర్గాలు నివసించే కాలనీల సమస్యలు పరిష్కరిస్తామని జంగా రాఘవరెడ్డి అన్నారు