
మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాల
మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సనత్ నగర్ ఇండస్ట్రియల్ క్లస్టర్లో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని సిపిఎం సనత్ నగర్ జోన్ కన్వీనర్ జి నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కార్మికుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, కంపెనీలో పని చేసే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వడం లేదని, కంపెనీలో పనిచేసే కార్మికులకు ఎస్ఐ పీఎఫ్ సౌకర్యం లేదని, కంపెనీలో పనిచేసే పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, కేంద్రంలో మోడీ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని ప్రైవేట్ రంగం రోజురోజుకు తిరుగుతుందని, ఇష్ట రాజ్యాంగ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని, కనీస నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని, లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని , కార్మికుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను ద్వేషించి మాట్లాడారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాట్కో కంపెనీ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు ఆటో యూనియన్ నాయకులు విజయ్ కుమార్, సిరాజుద్దీన్, ఎండి నజీర్, తదితరులు పాల్గొన్నారు