ఈ69న్యూస్ జనగామ:- తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.లింగాల ఘనపూర్ మండలం నాగారం,నెల్లుట్ల,లింగాల ఘనపూర్ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగ ప్రవేశ పెట్టిన రేషన్ కార్డదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని తెలిపారు.సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని మర్చిపోవద్దని మీ అందరి ఆదరణ ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని కోరారు.