
telugu galam news e69news local news daily news today news
ప్రశాంతమైన భద్రాద్రిలో అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టాలి లీజ్ వివాదంలో బెదిరింపుల సంస్కృతి మంచిది కాదు అటువంటి వారు పట్ల పోలీసుల అప్రమత్తం ఉండాలి. సిపిఎం
గత రెండు రోజులుగా భద్రాచలం పట్టణంలో ఒక రెస్టారెంట్ లీజు విషయంలో నెలకొని ఉన్న పరిస్థితులు భద్రాచలం ప్రశాంతత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నదని, ఇరు వర్గాల మధ్య వచ్చిన స్థలం లీజు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, సీపీఎం హితవు పలికింది. ఈ వివాదాన్ని ఆశరా చేసుకొని కొద్దిమంది అసాంఘిక శక్తులు బెదిరింపులకు పాల్పడడం మంచి సంస్కృతి కాదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఒక హోటల్ లీజు విషయంలో జరిగిన పరిణామాలను గమనిస్తుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ సమస్యను జటిలంజేసి చట్టాల పేరుతో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇది భద్రాచలం పట్టణ శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తుందని అన్నారు. ఇలాంటి సంఘటనలు భద్రాచలం పట్టణంలో రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లీజు వివాదంలో పట్టణ హోటల్ అసోసియేషన్ సభ్యుల మధ్య అనైక్యత రావడం సరైనది కాదని ఆయన అన్నారు. పట్టణంలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పట్టణ ప్రముఖులు ఇలాంటి విషయాల్లో సమన్వయం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి, బండారు శారత్ బాబు, వై వెంకట రామారావు, పి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.