సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్,జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు,రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ ఆదేశాల మేరకు శుక్రవారం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్"చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి,గుండెల రాయుడు కు హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గుండెల రాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కు మరియు జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు కు,రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ కు, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్-చంటి ముదిరాజ్ కు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గుండెల రాయుడు మాట్లాడుతూ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్-చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి, బత్తుల మహేష్ గౌడ్ ,మాదగోని శ్రీనివాస్ గౌడ్, బోధాస్ రాజు,జి.భాను ప్రసాద్,ఎండి మున్నా,రింగు ధీరజ్, కొమ్ము రాజు,పందుల రాజు గౌడ్ పాల్గొన్నారు.