
warangal news local news local news telugu galam news e69news
కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ సురేష్ లాల్
హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ:
సమాజ నిర్మాణంలో జర్నలిజం పాత్ర కీలకమని కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేష్ లాల్ అన్నారు.కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్స్ 2023-25 విద్యా సంవత్సరంలో చదువుతున్న ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం సమావేశం సీనియర్ విద్యార్ధులు నిర్వహించారు.జర్నలిజంవిభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ సభ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యునివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ లాల్ హాజరయ్యి మాట్లాడుతూ జర్నలిజం మొదటి సంవత్సరం విద్యార్థులు తమ రెండు సంవత్సరాల అనంతరం ఉద్యోగ అవకాశాలు బయటకు వెళ్లి జీవితంలో స్థిరపడడంతో పాటు సమాజంలోని అనేక రుగ్మతలు సమస్యలపై దృష్టి సారించి,వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వంకు సలహాలు ఇచ్చే విధంగా ఉండాలన్నారు. జర్నలిజం విద్యార్థులు తమ విద్యాభ్యాసం అనంతరం సమాజం కార్య క్షేత్రంగా చేసుకొని పనిచేయాలని సూచించారు. జర్నలిజం విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు సమాజంలో చోటు చేసుకునే అనేక పరిణామాలను చూసి స్పందించి మీడియాలో రాయడం ద్వారా సమాజం అణగారిన వర్గాలకు బాసటగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం కు ఎంతో ఉద్యమ చరిత్ర తో పాటు సామాజిక బాధ్యత ఉందని అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం కు ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థులకు అధ్యాపకులకు ఆత్మీయ బంధం ఏర్పడుతుందని అన్నారు. జర్నలిజం విద్యార్థులల్లో సృజనాత్మకత శక్తి వృత్తి లో ప్రజల పక్షాన నిలిచి పోరాడే ధైర్యం ఉండాలన్నారు. దీనికి తోడు వారి కి వృత్తి పరమైన పరిజ్ఞానం నూతన సాంకేతిక పరిజ్ఞానం ను అలవర్చుకోవడంతోపాటు ఇంగ్లీష్ స్కిల్స్ ను మెరుగుపరచుకోవాలని సూచించారు. శివకేర్ రాసిన యుకేవిన్ లాంటి మరెన్నో మంచి పుస్తకాలు చదవాలని విద్యార్తులకు సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జర్నలిజం విభాగ అధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ ఐటీ రంగం లో ఉన్న వారికి ఉద్యోగాలు రాకపోయినా జర్నలిజం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు తమ పూర్వ విద్యార్థుల ప్రింట్ ఎలక్ట్రానిక్, తో పాటు సోషల్ మీడియా సినిమా నిర్మాణ రంగంలో అడ్వర్టైజ్మెంట్ ప్రజా సంబంధాల శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిజం విభాగ ఫ్యాకల్టీ కంచర్ల నరసింహారాములు, దడబోయిన శ్రీకాంత్ యాదవ్ , పి పద్మ, పెరుమల్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ శంకర్, ఈర్ల సురేందర్, మోటే చిరంజీవి, సీనియర్ విద్యార్థులు సురేష్ నాయక్,మానస, శివాజీ, సంతోష్, హరీశ్, మల్లేష్, శివలీల,స్నేహ, కళ్యాణి ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్నపూర్ణ, ప్రభాకర్, రాణి మౌనిక , లిల్లీ తదితరులు పాల్గొన్నారు.